- సీపీ సీవీ ఆనంద్
- ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ హోదాలో కేసుల విచారణ
- హుమాయూన్‌నగర్ గ్యాంగ్ వార్‌లో వార్నింగ్
- 19 మంది బైండోవర్
హైదరాబాద్, వెలుగు: సిటీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. రౌడీషీటర్స్, కమ్యూనల్ అఫెండర్స్‌పై పటిష్టమైన నిఘా కొనసాగుతున్నదని తెలిపారు. ఇటీవలి కాలంలో సిటీలో నమోదైన కేసులను అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో గురువారం ఆయన విచారించారు. హుమాయున్ నగర్ పీఎస్ పరిధిలో ఈ నెల 7వ తేదీన ఫిరోజ్ ఖాన్, మాజీద్ ఖాన్ గ్రూపుల మధ్య జరిగిన గొడవ కేసులో నిందితులను విచారించారు. రెండు గ్రూపులకు చెందిన మొత్తం 19 మందిని ప్రశ్నించారు. రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తిగత బాండ్‌ను అందించాలని ఆదేశించారు.